శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం..
శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుండి వచ్చిన నితిన్షా, జెడ్డా నుండి వచ్చిన షేక్ సకినా అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే వారిద్దరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎయిర్ పోర్టు అపోలో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

