Home Page Slidermoviestelangana,

‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో విషాదం..

పుష్ప-2 బెనిఫిట్ షో చూడడానికి వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు అభిమానులతో కలిసి చిత్రాన్ని చూడాలని ఆశించి వచ్చిన అల్లు అర్జున్‌ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. దీనితో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో రేవతి(35) అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయారు. దీనితో జరిగిన తొక్కిసలాటలో వారు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు వారికి సీపీఆర్ చేసి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మరణించారు. శ్రీతేజ పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్‌కు తరలించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.