ఆదిలాబాద్ జిల్లా గిరిజన బాలికల పాఠశాలలో విషాదం
ఇచ్చోడ మండలం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ కూతురు మరణంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఆసుపత్రికి బలవంతంగా పోలీసులు తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది.

