జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల సందర్భంగా TPCC చీఫ్ మహేశ్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని తెలిపారు. మెజారిటీ మరింత పెరగాల్సి ఉన్నప్పటికీ, తక్కువ ఓటింగ్ శాతం ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు.
అదే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. ఈ ఎన్నికల్లో BRS డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని, మహిళల సెంటిమెంట్‌ను తమవైపును తిప్పుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిందని విమర్శించారు. అయితే ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేశారని తెలిపారు.
ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని, ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

