Home Page SliderTelangana

యువత సేవా పథం వైపు…

కొడిమ్యాల: తరగతి గదిలో పుస్తకాలు, కలం పట్టి రాయడం, చదవడమే కాదు.. పలుగు, పార పట్టి శ్రమదానం, సమాజ సేవ చేయడం కూడా తెలుసని నిరూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమాజ అవగాహన కోసం గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో పాల్గొంటూ నిస్వార్థ సేవకులుగా పనిచేస్తున్నారు. ఇందుకు జాతీయ సేవా పథకం శిబిరాలు వేదికగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులుగా కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రమదానం, స్వచ్ఛభారత్, సామాజిక రుగ్మతలు, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాలు వంటి పలు అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామస్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.