దాల్ సరస్సులో పర్యాటకుల బోటు బోల్తా
జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సులో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. బలమైన గాలులు వీయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక సరస్సులో పడ్డ టూరిస్టులు ప్రాణభయంతో కేకలు వేశారు. వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.