Home Page SliderNational

ఉత్తరాధిలో దంచికొడుతున్న వర్షాలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ భారీ వర్షాలకు ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్‌లో వరద భీభత్సం సృష్టిస్తోంది. దీంతో అధికారులు ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్  జాతీయ రహదారులను మూసివేశారు.దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్,పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసినట్లు తెలుస్తోంది. కాగా రాబోయే మరో 5 రోజులు కూడా వర్షాలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అస్సాంలోని 27 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.