Home Page SliderInternational

టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్..భారత్ చెత్త రికార్డు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. భోజన విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు మాత్రమే చేసింది. జడేజా, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లు డకౌట్ కాగా, రోహిత్ శర్మ 2 పరుగులు, జైశ్వాల్ 13 పరుగులు మాత్రమే చేశారు. రిషబ్ పంత్ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లు సునాయాసంగా పలు వికెట్లు సాధించారు. విలియం 3, సౌతీ 1, హెన్రీ 2 వికెట్లు తీశారు. భారీ వర్షం కారణంగా నిన్న మ్యాచ్ రద్దయి, ఈ రోజు మొదలయ్యింది. దీనితో పిచ్ బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదన్నది బ్యాటర్ల వాదన. బంతిని ఎదుర్కోవడానికే టాప్ బ్యాట్స్‌మెన్ ముప్పతిప్పలు పడ్డారు.