Home Page SlidermoviesNationalVideos

వేవ్స్‌ ముంబైలో టాప్ సెలబ్రెటీలు

భారతీయ సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే1) ప్రారంభించారు.  వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్- వేవ్స్ ముంబై వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్‌ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి.  స్టార్లు చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి టాప్ నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.