HealthHome Page SliderNational

ఆహారంలో అధిక ప్రోటీన్ కూడా ప్రమాదకరమే

మానవ శరీరానికి సాధారణంగా 50 నుండి 175 గ్రాముల ప్రోటీన్ రోజువారీ ఆహారంలో భాగంగా సరిపోతుంది. కానీ బరువు తగ్గాలనుకునే వ్యక్తులు తమ ఆహారంలో మిగిలిన ఆహారాన్ని తగ్గించి ప్రోటీన్‌ను అధికంగా తీసుకుంటారు. కానీ ఆహారంలో అధిక ప్రోటీన్ కూడా ప్రమాదకరమే అని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు కూడా సమపాళ్లలో ఉండాలని హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇతర పోషకాల కంటే ప్రోటీన్లు ఎక్కువయితే డీహైడ్రేషన్ ఏర్పడవచ్చు. శరీర పనితీరు కూడా తగ్గవచ్చు. శరీరం తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రోటీన్ బార్‌లు, కుకీలు, డెజర్ట్‌ల వంటివి కొంతమేరకు ఆరోగ్యంగా అనిపించినా, ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ప్రోసెస్ చేసిన ప్రోటీన్ పదార్థాల కంటే అవి సహజ సిద్ధంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.