రేపు చుక్క ముక్క బంద్
గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం,మాంసంపై ఏపి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదివారం ఎలాంటి మద్యం,మాంసం క్రయవిక్రయాలు జరపడానికి వీల్లేదని తెలిపింది. శనివారం అర్ధరాత్రి నుంచే జంతువులను వధించడం,అర్ధరాత్రి దాకా మద్యం దుకాణాలను తెరిచి ఉంచే పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఇదే తరహా నిబంధనలు రాష్ట్రం అంతటా అమలులో ఉంటుందని తెలిపారు. దీంతో మందు బాబులు,మాంసం ప్రియులు సందిగ్ధంలో పడుతున్నారు.