Home Page SliderTelangana

దిగి వచ్చిన టమాటా ధరలు

గత కొన్ని రోజులుగా మండుతున్న టమాటా ధరలు దిగివచ్చాయి. సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. గత నెలరోజులుగా టమాటోలు కేజీ రూ.100 పైనే విక్రయాలు జరిగాయి. దీనితో సామాన్యులు టమాటాను కొనే స్థితిలో లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం టమాటా ధర దిగివచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.50కి, రూ.60 కి కూడా కొన్ని చోట్ల లభిస్తున్నాయి. రేటు పెరగడంతో రైతులు సప్లైని కూడా పెంచారని, మార్కెట్లోకి ఎక్కువగా రావడంతో వాటి ధరలు కంట్రోల్‌లోకి వచ్చాయని వ్యాపారులు చెప్తున్నారు. ఇలాగే టమాటా పంట ఉత్పత్తి ఎక్కువైతే మళ్లీ ధరలు పాతాళానికి పడిపోయే అవకాశం ఉంది.