రజనీకాంత్ సినిమాలో విలన్గా టాలీవుడ్ స్టార్ హీరో
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విలన్గా ఈసారి మన్మధుడు నాగార్జున నటించబోతున్నారనే వార్తలు తమిళ పరిశ్రమలో హల్చల్ చేస్తున్నాయి. నాగార్జున తొలిసారిగా విలన్ పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.