ఐపీఎస్ ఆఫీసర్‌తో టాలీవుడ్ హీరోయిన్ రచ్చ-కేసు నమోదు
‘రామబాణం’ చిత్ర హీరోయిన్ డింపుల్ హయతి వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి ఆ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఐపీఎస్ ఆఫీసర్‌తో గొడవ పెట్టుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌తో కారు పార్కింగ్ వ్యవహారంలో ఆయనతో డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్ తరచూ గొడవ పడుతుంటారని తెలిసింది. వీరిద్దరూ హుడా ఎన్‌క్లేవ్‌లోని ఎస్‌కేఆర్ అపార్టమెంట్‌లో కలిసి ఉంటున్నారు. తాజాగా ఆ ఆఫీసర్ కారుని కాలితో తన్ని ఉద్దేశ్యపూర్వకుంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనితో ఆమెపై సదరు ఆఫీసర్ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే ఈ చర్యపై డింపుల్ ట్వీట్ చేసింది. అధికారం ఉన్నంత మాత్రాన తప్పులు, ఒప్పులుగా మారవు అనే ఉద్దేశంతో డీసీపీ రాహుల్‌ను ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది. తనకు వారిపై ఎలాంటి వ్యక్తిగత కక్ష్య లేదని డీసీపీ పేర్కొన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో వివరాలన్నీ తెలుస్తాయని డిసీపీ తెలిపారు.

