మునుగోడు నామినేషన్లకు నేడే ఆఖరు
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైన బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేశారు. నిన్నటి సాయంత్రం వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పాటు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈరోజు నామినేషన్ వేయనున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీ, ఆప్ పార్టీలు మాత్రం పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.