నేటితో CSK టీమ్ ఫస్ట్ మ్యాచ్‌కు 15 ఏళ్లు..!
ప్రస్తుతం దేశంలోని క్రికెట్ అభిమానులంతా IPL మ్యాచ్ వీక్షించడంలో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ IPL సీజన్ మ్యాచ్‌లు అంత రసవత్తరంగా సాగుతున్నాయి మరి. ఈ నేపథ్యంలో అసలు ఈ IPL ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా..? మాకు తెలిసి వచ్చే ఉంటుంది. అంతేకాకుండా ఈ IPLలో అందరికి ఎంతో ఇష్టమైన CSK టీమ్ ఎప్పుడు ఫామ్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ IPL అనేది 2008లో ప్రారంభమైంది. ప్రస్తుతం ధోని సారథ్యంలో IPLలో దుమ్మురేపుతున్న CSK టీమ్ 2008లో సరిగ్గా ఇదే రోజున తన ఫస్ట్ IPL మ్యాచ్‌ను ఆడింది. కాగా అప్పటి నుంచి CSK టీమ్ ప్రతి సంవత్సరం జరిగే IPL లో పాల్గొంటుంది. ఈ టీమ్ ఆటలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ..అభిమానులను సంపాదించడమే కాకుండా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. దీంతో ఈ రోజు CSK ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ.. నెట్టింట సందడి చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన IPL మ్యాచుల్లో CSK టీమ్ ఏకంగా 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాకుండా 5సార్లు ఫైనలిస్టుగా IPL లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ముఖ్యంగా ప్రతి IPL సీజన్‌లో CSK కెప్టెన్ ధోని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటారు. అంతేకాకుండా ధోని గత 15 ఏళ్లుగా CSK టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం ప్రశంసించదగ్గ విషయమనే చెప్పాలి.

