పరువు కేసులో కోర్టు దగ్గరకు మంత్రి కొండా..!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో.. స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు.నటి సమంత విషయంలో అసభ్యకరంగా మాట్లాడారంటూ అక్కినేని నాగార్జున …కొండాపై ప్రైవేట్ కేసు వేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గతంలో విచారణ వాయిదా వేసింది.దీంతో తాజాగా ఆమె కోర్టు ఎదుట ఇవాళ హాజరయ్యారు.