Home Page SliderNationalNews AlertPolitics

కాంగ్రెస్‌పై టీఎంసీ సెటైర్

ఈవీఎంలపై కాంగ్రెస్ మాటలకు టీఎంసీ పార్టీ షాక్ ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే విషయంపై కాంగ్రెస్ పార్టీతో ఏకీభవించలేదు. ఇలా సందేహాలు లేవనెత్తేవారికి టీఎంసీ ఎంపీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలేనని, ఇలాంటి ఆరోపణల బదులు ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయాలో ఎన్నికల కమిషన్‌కు డెమో ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈవీఎంలను సరిగ్గా ర్యాండమైజేషన్ చేస్తే అంతా సవ్యంగానే ఉంటుంది. పోలింగ్ బూతులో మాక్ పోలింగ్, ఓటింగ్, కౌంటింగ్ వంటి వన్నీ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు.