పాక్‌కు టిట్ ఫర్ టాట్..అరేబియాలో అలజడి
పహల్గాం దాడి ఘటనతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేస్తున్న సమయంలో భారత్ కూడా టిట్ ఫర్ టాట్ ఇచ్చింది. ఐఎన్‌ఎస్ సూరత్ ద్వారా గైడెడ్ మిసైల్‌ను ప్రయోగించి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని ఛేదించగలదు. అలాగే విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలోని కర్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది. భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతో ఉందని రుజువు చేసింది.