తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు.. సెక్యూరిటీతో కార్పొరేటర్లు..
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరగనుండడంతో నిన్నంతా ఉద్రిక్తతగా మారింది. కూటమి నేతల బెదిరింపులు, విపక్ష వైసీపీ నేతలపై దాడులు, కిడ్నాప్‌లు వంటి హై డ్రామాల మధ్య నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. దీనితో కోర్టు ఆదేశాలతో వైసీపీ కార్పొరేటర్లకు ఎస్కార్టు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా సిబ్బందితో నేడు ఈ ఎన్నికకు హాజరయ్యారు కార్పొరేటర్లు. తిరుపతిలో 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు.

