Andhra PradeshNews Alert

కనులపండుగగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవోపేతంగా ముస్తాబవుతోంది. ఆ శ్రీనివాసుని వాహనాలలో గరుడ వాహనసేవ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ప్రతీ పౌర్ణమినాడు గరుడునిపై విహరించే మలయప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఇక బ్రహ్మోత్సవాలలో జరగబోయే పౌర్ణమి గరుడసేవను చూడడానికి రెండుకళ్లూ చాలవు. ఈ నెల 10 న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకూ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది.