తీన్మార్ మల్లన్నకు…’చింతా’క చితచిత!
చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.మీనాక్షి నటరాజన్ … తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే తీన్మార్ మల్లన్నపై వేటు పడటంతో కాంగ్రెస్ లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని తీన్మార్ మల్లన్న గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.ఈ విషయంపై గతంలో అతన్ని షోకాజ్ చేసినా స్పందించకపోవడంతో వేటు పడింది.

