Home Page SliderNational

ప్రధాని మోదీకి ‘తిలక్ నేషనల్ అవార్డ్’

భారత్ ప్రధాని మోదీకి గొప్ప సత్కారం లభించనుంది. గొప్ప జాతీయోద్యమ నాయకుడైన లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రధాని మోదీకి ప్రధానం చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వతంత్య్రమే ‘నాజన్మహక్కని’ చాటారు లోకమాన్య తిలక్. బ్రిటిష్ వారితో ఎడతెగని పోరాటం చేసిన అమరజీవి. ఆగస్టు 1న పూణెలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. గొప్ప నాయకునిగా దేశ ప్రజలను ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ అవార్డును అందించడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. దీనికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కూడా ఆహ్వానించారు. ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్( హింద్ స్వరాజ్ సంఘ్) నిర్వహిస్తున్న ఈ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ఆగస్టు 1 వతేదీన లోకమాన్య తిలక్ 103 వ వర్థంతి  సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి ప్రధానం చేస్తున్నట్లు తెలియజేశారు.