కుంటాల మండలంలో పెద్దపులి సంచారం
నిర్మల్ జిల్లా కుంటాల మండల పరిసరగ్రామాల్లో పెద్దపులి సంచరిస్తుంది.ఆవుల మందపై దాడి చేసింది.దీంతో పశువులకాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా జంకుతున్నారు.ఈ విషయాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అధికారులకు అందించారు.దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి పెద్దపులి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.పులి పంజా అనవాళ్ల ప్రకారం అది సంచరించే ప్రాంతాలను అన్వేషించే పనిలో పడ్డారు.