మరోసారి పెద్దపులి దాడి
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి పంజా విసిరింది. కౌటాల మండలం రన్వెల్లి గ్రామానికి సమీపంలో గల కుర్తా వద్ద బుధవారం రాత్రి పులి ఓ మేకల దొడ్డిలో చొరబడి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామంలోని రైతులకు చెందిన 23 మేకలు చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మేకలపై పెద్ద పులి దాడి చేయడంతో గ్రామస్థులు ఇళ్లల్లోంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ప్రస్తుతం అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.


 
							 
							