రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో వానలు
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్ , మంచిర్యాల , జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెరుపులు , ఉరుములు , ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నట్టు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం , వాయు గుండంగా మారడంతో వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ద్రోణి ప్రస్తుతం వాయువ్య పశ్చిమ , ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నట్టు సమాచారమిచ్చారు.

బాలాసోర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా ద్రోణి కేంద్రికృతమైందని , ఒరిస్సా తీరంలోని సాగర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఇది పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ , ఉత్తర ఒరిస్సా మీదుగా కదులుతూ బలహీన పడే సూచనలు ఉన్నాయన్నారు. వీటి ప్రభావంతో ఆకాశంలో నల్లటి మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.