నవగ్రహ దేవతామూర్తులను ధ్వంసం చేసిన దుండగులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహదేవతామూర్తులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు నిర్వహించేందుకు ప్రాతఃకాల సమయంలో వచ్చిన ప్రధానార్చకులు, భక్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవతామూర్తులను ధ్వంసం చేయడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.