ఏటిఎంకి నిప్పు పెట్టిన దుండగులు
ఏటిఎం చోరీలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి.గతంలో బీహార్ కే పరిమితమైన ఏటిఎం దొంగతనాలు దక్షిణ భారత రాష్ట్రాలకు ఎగబాకాయి.కొన్నాళ్లు పాటు స్థబ్దుగా ఉన్న ఏటిఎం చోరీలు మళ్లీ జడలు విప్పాయి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ గ్యాంగ్ స్టర్..ఏకంగా ఏటిఎంకే నిప్పు పెట్టాయి.తొలుత దొంగతానికి వచ్చిన దుండగులు ఎంతకీ ఏటిఎం తెరుచుకోకపోవడంతో సహనం కోల్పోయి కోపోద్రిక్తులై నిప్పు పెట్టారు. ఈ ఘటన మైలార్ దేవరపల్లిలో చోటు చేసుకుంది. మధుబనకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు ఏటిఎంని తెరవడానికి విఫలయత్నం చేశారు.ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్ సహా, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.