Andhra PradeshHome Page Slider

పురాతన మిద్దె కూలి ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. రెండ్రోజులుగా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కుందుర్పి మండలం ఏనుములదొడ్డి పంచాయతీ రుద్రంపల్లి గ్రామంలో పురాతన మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పురాతన మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.