‘మూడు కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు’..కేటీఆర్
‘ముప్పైసార్లు ఢిల్లీకి పోయి మూడు పైసలు తేలేదు కానీ, తనపై మూడు కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారని’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్. తనపై పెట్టిన ఈ కార్ రేస్ కేస్ విషయంలో ఆయన ఇలా స్పందించారు. ‘బీజేపీతో ఢిల్లీలో చిట్టిగారి కాళ్లబేరాలు, జైపూర్‌లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది’. అంటూ ఎద్దేవా చేశారు. ‘కేసు పెట్టుకుని ఆనందించండి. మీ ఖర్మ.. గుడ్ లక్’ అంటూ ట్వీట్ పెట్టారు. గత ప్రభుత్వ కాలంలో ఈ కార్ రేస్ ఏర్పాట్లలో నిధుల గోల్‌మాల్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేటీఆర్‌పై దర్యాప్తు చేయడానికి గవర్నర్ అనుమతి కోరింది. ఆయన అంగీకరించడంతో కేటీఆర్‌పై కేసు నమోదు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.