పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఆయనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీని గురించి సిబ్బంది పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి, పోలీసులు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన మద్యం మత్తులో ఈ కాల్స్ చేసినట్లు గుర్తించారు. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

