బటన్ నొక్కడం అంటే ఏంటో ఆ బడుద్దాయిలకు తెలియదు: సీఎం జగన్
ఈ రోజు ఏపీ సీఎం జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటిస్తున్నారు. కాగా అక్కడ జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కురుపాంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏపీలో దేశంలో మరెక్కడా లేనివిధంగా అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకంతోనే బటన్ నొక్కి నాలుగేళ్ల నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కాగా ఈ నాలుగేళ్ల ఎక్కడా అవినీతికి తావు లేకుండా రూ.26 వేల కోట్లు అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు అందించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బటన్ నొక్కడం అంటే ఇదీ..బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండని కోరుతున్నామన్నారు. ఇలా ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పథకాన్ని ప్రజలకు చేరవేయడాన్నే బటన్ నొక్కడం అంటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.

