Home Page SliderNational

గురుగోవింద్ సింగ్, వారి తనయుల త్యాగానికి రూపమే ఈ ‘వీర్ బాల్ దివస్’..కిషన్ రెడ్డి

సిక్కుమత ధర్మ పరిరక్షణ కోసం మొఘల్ సైన్యానికి ఎదురు తిరిగిన గురు గోవింద్ సింగ్, వారి కుమారులు బాబా జోరావర్ సింగ్ (9), బాబా ఫతే సింగ్ (6) బలిదానానికి గుర్తుగా ఈ వీర్ బాల్ దివస్‌ను జరుపుకుంటున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేయాలని  మొఘల్ సైన్యం అనేక రకాలుగా వేధింపులకు, దౌర్జన్యాలకు గురిచేశినా, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన పదవ సిక్కు గురువు శ్రీ గురుగోవింద్ సింగ్ కుమారులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మంత్రి కిషన్ రెడ్జి. అమీర్ పేటలోని గురుద్వారాను సందర్శించి, ర్యాలీ నిర్వహించారు మంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘గురు గోవింద్ సింగ్‌ను ఆయన ఇద్దరు పుత్రులను కూడా ఔరంగజేబు సైన్యం బంధించి సిక్కు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం జరిగింది. ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేయాలని అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. మతం మారే ప్రసక్తే లేదని ఆ ఇద్దరు పసిపిల్లలు ఔరంగజేబుకు, మొఘల్ సైన్యానికి సవాల్ విసిరారు.చివరకు ఆ ఇద్దరు పసిపిల్లలను నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలతో సమాధి చేసి వారిని బలిగొన్నారు. వారి త్యాగనిరతికి గుర్తుగా  డిసెంబరు 26న ఢిల్లీలో జరిగిన కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వీర బాల్ దివస్ నిర్వహించాలని దేశమంతా వేలాది కార్యక్రమాలను చేపడుతున్నాము. అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు అనేక ప్రాంతాల్లో గురుద్వార్ కు వెళ్లి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వీర బాలలకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నా. గురుగోవింద్ సింగ్ చేసిన పోరాటం గురించి ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి వీడియోల ద్వారా వివరిస్తున్నాము. విదేశీయులతో, ఆక్రమణ దారులతో పోరాటం చేసిన గురుగోవింద్ సింగ్, వారి తనయులను మనందరం కడా స్మరించుకోవాలి. ఆ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందడుగు వేయాలి. దేశ అభివృద్ధి కోసం తోడ్పడాలి’. అని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.

భారత్ మండపం, ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలో జరుగనున్న ఈ వీర్ బాల్ దివస్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ విచ్చేసి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. దేశంలోని వివిధ పాఠశాలలనుండి విచ్చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. పంజాబ్, కేరళ, మణిపూర్ వంటి రాష్ట్రాల చిన్నారులు  కరాటే, కరళి వంటి యుద్ధవిద్యలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.