దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఈ వెరైటీ చిత్రం..
ఇటీవల తెలుగులో రిలీజై వెరైటీ చిత్రంగా పేరు తెచ్చుకుని సూపర్ హిట్ అయిన ‘క’ చిత్రానికి మరో గొప్ప అవార్డు దక్కింది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం నటించారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. దీనిని నూతన దర్శకులు సుజిత్, సందీప్‌లు తెరకెక్కించారు. నయన్ సారిక, తన్వీరామ్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని ముందే ప్రకటించారు మూవీ టీమ్.