HealthHome Page SliderInternational

రక్తస్రావానికి అడ్డుకట్ట వేసే అద్భుత జెల్ ఈ ‘ట్రామా జెల్’

ఎంతటి తీవ్రమైన రక్తస్రావానికైనా ఇట్టే అడ్డుకట్ట వేసే అద్భుతమైన జెల్‌కు  ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ ఆమోదముద్ర వేసింది. ‘ట్రామా జెల్’ అనే పేరు గల ఈ జెల్ రక్తస్రావ నిరోధానికి బాగా పనిచేస్తుంది. ప్రాణాంతకమైన తుపాకీ, కత్తి గాయాల కారణంగా ఏర్పడే రక్తస్రావాన్ని ఈ జెల్ ద్వారా క్షణాల్లో కంట్రోల్ చేయవచ్చు. గాయంపై దీనిని పూస్తే తక్షణం రక్తస్రావం ఆగిపోతుంది. రక్తస్రావం ఉండే చోట దీనిని సిరెంజితో శరీరంలో పంపిస్తే రక్తస్రావం తగ్గుతుంది. దీనిని ‘క్రెసిలాన్స్’ అనే బయోటెక్నాలజీ సంస్థ తయారు చేసింది.