crimeHome Page SliderInternationalTrending Today

ఈ పాపం హమాస్‌దే.. మాకు సంబంధం లేదు’ ఇజ్రాయెల్


గాజాలో అమానవీయ ఘటన జరిగింది. గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ (మానవతా సాయం పంపిణీ కేంద్రం) వద్ద ఆహారం కోసం వచ్చిన పాలస్తీనియన్లపై ఆదివారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 31 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. వేల సంఖ్యలో వస్తున్న జనంపై కిలోమీటర్ దూరం నుండి కాల్పులు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే తమకు సంబంధం లేదని, హమాసే గాజా పౌరులపై దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో కూడా విడుదల చేసింది. అయితే ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) పంపిణీ కేంద్రం దగ్గర ఈ దాడి జరిగిందని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. సైన్యం కాల్పులు జరిపిందన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఐడీఎఫ్ తెలిపింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాయం పంపిణీ జరిగిందని జీహెచ్ఎఫ్ పేర్కొంది. “ఆహారం తీసుకోవడానికి వెళుతున్న ప్రజలపై ఓ గన్మెన్ కాల్పులు జరుపుతున్నట్లు డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాల్లో ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆహారం తీసుకోకుండా అడ్డుకోవడానికి హమాస్ తన చేతిలో ఉన్న శక్తినంతా ప్రయోగించింది” అని ఐడీఎఫ్ ట్విటర్లో ఆరోపించింది. ఈ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం నిందించుకొంటున్నాయి. మృతులను తల, ఛాతిపై కాల్చి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.