ఈ విధానం అమెరికాకే నష్టం.. చైనా కీలక వ్యాఖ్యలు
అమెరికా- చైనా సుంకాల విషయంలో ఎట్టకేలకు ఒక ఒప్పందానికి వచ్చాయి. బీజింగ్‌లోని జరిగిన అధికారుల శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. అమెరికా విధానమైన బెదిరింపులు, ఆధిపత్య ధోరణి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయని అది ఆ దేశాన్నే ఒంటరిని చేస్తుందన్నారు. ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఉండరన్నారు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాలని పేర్కొన్నారు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య సుంకాల పరస్పర యుద్ధం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం వీరి ఒప్పందాలు కుదిరిన కారణంగా అమెరికా, చైనాలు వాటి సుంకాలు గణనీయంగా తగ్గించుకున్నాయి.