ఈ తప్పు హత్య కన్నా ఘోరమైనది..సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ విషయంలో తగ్గేదే లేదని సుప్రీంకోర్టు తన తాజా తీర్పు ద్వారా వెల్లడించింది. తాజ్ ట్రాపిజెమ్ జోన్ పరిధిలోని మధుర-బృందావన్‌లో దాల్మియా ఫార్మ్స్ నిర్వాహకుడు శివ్ శంకర్ భారీగా చెట్లు నరకడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. పర్యావరణం కళ్లెదుటే నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని, అది హత్య కన్నా ఘోరమైన తప్పని వ్యాఖ్యానించింది. ప్రతీ చెట్టుకు రూ.1 లక్ష చొప్పున అన్ని చెట్లకు కలిపి రూ.4 కోట్ల 54 లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అంత వృక్ష సంపదతో మళ్లీ పచ్చదనం రావాలంటే మరో వందేళ్లు పట్టొచ్చు. కాలుష్య ప్రభావం రాబోయే తరాల మీద పడకుండా ఉండాలంటే చెట్లు అవసరం. ఇది అందరి బాధ్యత అని అభిప్రాయపడింది.