‘ఇది పుల్వామా కంటే దారుణం’.. అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పహల్‌గావ్ ఉగ్రదాడిపై స్పందించారు. పర్యాటకులపై ముష్కరుల దాడి ఘటన హేయమని, ఇది పుల్వామా కంటే దారుణంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ దాడి విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.