దేశ ప్రజలు మోదీని వదిలించుకునే సమయం ఇదే:కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లల్లో దేశంలోని ప్రతి రంగాన్ని అమ్మకానికి పెట్టారని ఆయన విమర్శించారు. దేశప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి ,ఆర్థిక వ్యవస్థను చిందరవందర చేశారని సీఎం కేజ్రివాల్ ఆరోపించారు. మోదీ హయాంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు ,అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిందని ఆయన దుయ్యబట్టారు. అయితే దేశ ప్రజలు ఆయనను వదిలించుకునే సరైన సమయం ఇదేనని..దీనికి అందరు కలిసి ముందుకు రావాలని సీఎం కేజ్రివాల్ పిలుపునిచ్చారు.