Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

‘కేసీఆర్‌ కుటుంబంలో దానికోసమే ఈ గొడవ’ ..కోమటిరెడ్డి

కేసీఆర్‌ కుటుంబంలో ఆస్తుల కోసమే ఈ గొడవలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్‌ఎస్ పార్టీలో కేటీఆర్‌, కవిత, హరీష్‌రావులు విడిపోరని, ఇప్పుడు జరుగుతున్నదంతా డ్రామానే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ నాశనం చేసిందన్నారు. జూన్‌ 6న యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన ఉంటుందని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పథకాలు అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు.