గేట్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురుచూసే గేట్ 2025 పరీక్షకు షెడ్యూల్ విడుదల చేసింది ఐఐటీ రూర్కీ. సబ్జెక్టుల వారీగా, పేపర్ల వారీగా గేట్ పరీక్ష పూర్తి షెడ్యూల్ వెబ్‌సైట్‌లో వెల్లడి చేసింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 1,2, 15, 16 తేదీలలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి 12.30 వరకూ మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ రెండవ సెషన్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా ఫలితాలను మార్చి 19వ తేదీన విడుదల చేస్తారు. ఈ గేట్ స్కోర్ అనేక పోటీ పరీక్షలకు పనికి వస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా పలు విద్యాసంస్థలలో ఎమ్‌టెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉద్యోగాలలో గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి.


 
							 
							