Home Page SliderNational

మూడవసారి ప్రధానిగా మోదీ తొలి సంతకం దీనిపైనే..

ముచ్చటగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన మూడవసారి ప్రధానిగా తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధికి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. సౌత్ బ్లాక్‌లోని పీఎం కార్యాలయం నుండి ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం రైతుల ఖాతాలలో రూ. 20 వేల కోట్లు ఆర్థిక సహాయం విడుదల చేస్తూ సంతకం చేశారు.