ఇదే షమీకి లాస్ట్ ఛాన్స్..
మహ్మద్ షమీకి బీసీసీఐ లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. బీజీటీ (బోర్డర్-గావస్కర్) సిరీస్‌లో తీసుకోవడానికి డెడ్ లైన్ విధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ ఆడుతున్నారు మహ్మద్ షమీ. ఈ టోర్నీలో ప్రతీ స్పెల్ అనంతరం బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స చేస్తోంది. ఆయన ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నారని, మరో పది రోజులలో తగ్గి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. ఆయన ఫిట్‌నెస్ నిరూపించుకుంటే మూడవ టెస్టుకు షమీ అందుబాటులోకి రావొచ్చు.