“ఇది నా అదృష్టం.. ఇంకా నమ్మలేకపోతున్నా”.. నిత్యామేనన్
ఇప్పటికీ తనకు జాతీయ అవార్డు వచ్చిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని హీరోయిన్ నిత్యామేనన్ పేర్కొన్నారు. జాతీయ అవార్డు లభించడం తన అదృష్టమని, తనకు ఎంతో సంతోషంగా ఉందని మీడియాతో తెలిపారు. తిరుచిత్రంబలం అనే చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తకు ఎంతో సహకారం అందించారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వచ్చిందని తెలియగానే తనకు వరుసగా అబినందనలు తెలుపుతూ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక మీదట కూడా తాను ఎంపిక చేసుకునే చిత్రాలు, తన టీమ్‌లో మార్పేమీ ఉండదని గతంలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నానని స్పష్టం చేశారు.

