home page sliderInternationalNews AlertPolitics

ఇది నీటియుద్ధం.. అన్యాయం..పాక్ అక్కసు

పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. తాజాగా పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారీ ఒక సోషల్ మీడియాలో తన అక్కసు వెల్లగక్కాడు. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం అన్యాయమని, భారత్ నిర్ణయం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఈ ఒప్పందం చేసుకున్నామని, ఈ హక్కును కాపాడుకుంటామని, న్యాయపోరాటం చేస్తామంటూ రాసుకొచ్చారు. భారత్ నీటి యుద్ధానికి పాల్పడుతోందని ఆరోపించారు. అయితే భారత్‌ ఈ నీటి ఒప్పందం విషయంలో ఏ సంస్థకూ కట్టుబడి ఉండాలనే నియమం లేదు. ఏ దేశంతో చేసుకున్న ఒప్పందమైనా రద్దు చేసుకునే హక్కు భారత్‌కు ఉంది. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా అది భారత్‌కు వర్తించదు. పాకిస్థాన్ జీడీపీలో 25 శాతం ఈ నదుల నుండే రావడంతో పాక్‌ను ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.