Home Page SliderInternationalLifestyleNews Alert

ఈ భారతీయ జంటకు “మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌”గా గుర్తింపు

‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించిన “మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024” లిస్టులో భారతీయ జంట చోటు దక్కించుకున్నట్లు సమాచారం. వారు మరెవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి, అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటే.  భారత కుబేరుడు ముకేశ్, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో ఏడాదంతా అంగరంగ వైభవంగా జరిగింది. వారు రకరకాల ఈవెంట్లు, వేడుకల పేరుతో ధరించిన దుస్తులు, ఆభరణాలు, యాక్సిసరీస్ ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించాయి. వీరి వివాహంలో ‘ప్రీ వెడ్డింగ్ వేడుకలు’, ‘శుభ్ ఆశీర్వాద్’, ‘మంగళ్ ఉత్సవ్’, ‘శుభ్ వివాహ్’ వంటి ఈవెంట్లలో ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, సెలబ్రెటీలు, హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరి వివాహ సందర్భంగా అదానీ కుటుంబం 50 పేద జంటలకు ఉచితంగా వివాహం జరిపించి, బంగారం, దుస్తులు కూడా బహుమతిగా అందజేయడం విశేషం.