Home Page SliderTelangana

‘ఇదేం పంపిణీ’..సింగరేణి కార్మికుల నిరసన

ప్రభుత్వం, యాజమాన్యం కలిసి సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు సింగరేణి కార్మికులు, బొగ్గు గనుల కార్మికులు. లాభాల వాటా చెల్లింపులో తమకు న్యాయం జరగలేదని వాపోయారు. కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గుగనుల కార్మికులు తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని లెక్కకట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో నల్ల బాడ్జీలు ధరించి నిరసనలకు దిగారు. తాము గంటల తరబడి బొగ్గుగనులలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నామని తమకు సరైన ప్రోత్సాహకాలు లేవని నిరసన వ్యక్తం చేశారు.