Andhra PradeshcrimeHome Page Slider

5కేజిల బంగారం దొంగ దొరికాడు

విజయవాడలోని డివిఆర్ జ్యూవెలరీ షాపు చోరీని పోలీసులు చేధించారు. ఐదు కేజీల బంగారు ఆభరణాలను బైక్‌పై తీసుకొస్తున్న నాగరాజును హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరూ యువకులు ఆత్మకూరు బైపాస్ వద్ద అట‌కాయించారు. నాగరాజు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో కాగానే అకస్మాత్తుగా వచ్చిన ఆ ఇద్దరూ బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను తీసుకొని పారిపోయారని ఫిర్యాదు చేసిన నాగ‌రాజే అస‌లు దొంగ‌ని తేల్చారు.మంగళగిరికి చెందిన దివి రాము విజయవాడలో డివిఆర్ జ్యూవెలరీ షాపును నిర్వహిస్తున్నాడు. షాపులో తన బంధువైన నాగరాజుని మేనేజర్‌గా పెట్టుకున్నాడు. నాగరాజు ఆర్డర్లపై తయారు చేసిన బంగారు ఆభరణాలను ఆయా షాపులకు తీసుకెళ్లి డెలివరీ ఇస్తుంటాడు. అయితే నాగరాజు గత కొంతకాలంగా అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చినవాళ్లు పదే, పదే ఒత్తడి పెడుతూ ఉండటంతో.. మాస్టర్ స్కెచ్ వేశాడు. స్నేహితుల సాయంతో 5కేజిల బంగారాన్ని మాయం చేసి తెలివిగా పోలీసుల‌నే బురిడికొట్టించ‌బోయాడు.చివ‌ర‌కు విజయవాడలో సిసి కెమెరా విజువల్స్‌లో అతను బ్యాగుతో కనిపించడంతో.. పోలీసులకు అస‌లు విష‌యం బోధ‌ప‌డింది.వెంట‌నే నాగ‌రాజును అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచారించి బంగార‌రం క‌థ‌ని కంచికి చేర్చారు.