దట్టమైన పొగ, పలు రైళ్లు, విమానాలు రద్దు
భారత రాజధాని నగరం ఢిల్లీని పొగమంచు వదిలిపెట్టలేదు. దట్టమైన పొగ చుట్టుకుని రవాణా సౌకర్యాలకు ఆటంకం కలిగిస్తోంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం శనివారం ఉష్ణోగ్రత కనిష్టంగా 7 డిగ్రీలు, గరిష్టంగా 19 డిగ్రీలు ఉంది. మంచు కారణంగా విమానాల రాకపోకలకు, రైళ్లకు ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. దీనితో ఢిల్లీకి రావలసిన 47 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.